జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు వెనక తోకలా ఉండటం కోసం, ప్యాకేజి కోసమే ఆయన పార్టీ పెట్టాడని అన్నారు . 94 సీట్లు ప్రకటించిన చంద్రబాబు తాను కుప్పం నుండి పోటీ చేస్తానని, లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తాడని, బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తాడని అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని కూడా ప్రకటించేలేకపోయాడని అన్నారు.
పవన్ కళ్యాణ్ కి సొంతంగా పోటీ చేసే దైర్యం లేక కొంత కాలం బీజేపీతో, ఇంకొంత కాలం టీడీపీతో పొత్తు పెట్టుకొని కాలం గడుపుతున్నాడని ఆరోపించారు. టీడీపీ, జనసేనల జాబితా చూసాక వైసీపీ 175 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందన్న నమ్మకం వచ్చిందని అన్నారు పవర్ షేరింగ్, ఓట్ షేరింగ్ అంటూ ప్రగల్బాలు పలికిన పవన్ ఈరోజు చంద్రబాబు వేసే ముష్టి 24సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన జాబితా వచ్చాక సీటు దక్కని ఇరు పార్టీల నేతలు బాధలో ఉంటె వైసీపీ గెలుపు ఖాయమైందన్న ఆనందంలో వైసీపీ వర్గాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు పనైపోయిందని, ఈ ఎన్నికల తర్వాత ఆయన తాపీగా రెస్ట్ తీసుకోవచ్చని, ఆయనకు రెస్ట్ ఇచ్చే ప్రజలే కాకుండా తన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారని అన్నారు.