
సిద్దిపేట, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ లో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల జీవితాల తో పాటు అన్ని కులవృత్తుల కు పునర్ వైభవం దక్కిందన్నారు. కార్యక్రమంలోఎంపీపీ మాణిక్య రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.