ఓటరు జాబితాలో బీఎల్‌వోల పాత్ర కీలకం : వెంకట్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు:  ఓటర్ జాబితా రూపకల్పనలో బీఎల్‌వోల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్  వెంకట్ రెడ్డి చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్ఎల్ఎంటీ రమేశ్, డీఎంఎల్టీలు, తహశీల్దార్లు , డీటీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఓటరు జాబితా రూపకల్పనపై బీఎల్‌వోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు.  

ఓటర్ లిస్ట్ నవీకరించేందుకు వారికి జాబితా అందించాలని సూచించారు.  ఒక కుటుంబ ఓటర్లు ఒకే బూత్‌లో ఉండేలా మార్పులు, చేర్పులు చేయాలన్నారు.  ఇంటింటి సర్వేలో భాగంగా ఓటర్ ఇంటి పేరు, సెల్ నెంబర్లు,  అడ్రెస్ తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. జాబితాలో సర్వీస్ ఓటర్ల వివరాలు ఉండాలని, దివ్యాంగులు,  వృద్ధుల ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని కోరారు.