ఓట్లు రాల్చని సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా

సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పిలుపిస్తే ప్రభంజనంలా మారిపోయే మాట వాస్తవమే. నిర్భయ చట్టం, జల్లికట్టుకి అనుమతి వంటివన్నీ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా సాధించిన విజయాలు.  పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాత్రం సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా పాత్ర అంతంత మాత్రమేనని ఒక సర్వేలో తేలింది. 2014లో ‘చాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పె చర్చ’తో మోడీని జనాలకు చేరువ చేసిన ఈ మీడియా…. తాజా ఎన్నికల్లో అంతగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయిందని చెబుతోంది. బీజేపీకి ఓటు వేసినవాళ్లలో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేనివాళ్లు 36శాతం మంది ఉన్నారట!  మొత్తం ఓటర్లలో సోషల్ మీడియాతో హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్ ఉన్నవాళ్లు కేవలం టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉంటారని,  అసలు సోషల్ మీడియా ప్రభావమే పడనివారు 64 శాతం వరకు ఉన్నారని తేలిపోయింది.

‘ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే జనంలో పలుకుబడి ఉంటే చాలదు, సోషల్ మీడియాపై  పట్టుండాలి’ అనే అభిప్రాయం కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఎలక్షనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోషల్ మీడియా బలమైన ఆయుధంగా మారింది. ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వ్యవహారాలు చూడటానికి  ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎంతో మంది ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పెద్ద పెద్ద జీతాలిచ్చి ఈ విభాగాల్లోకి  తీసుకున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే… గెలుపోటములకు, సోషల్ మీడియాలో పై చేయి సాధించడానికి ఏమాత్రం సంబంధం లేదన్న వాస్తవం వెలుగు చూసింది. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీతి–సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ సర్వే ఈ విషయాన్ని  తేల్చి చెప్పింది. ఓటర్లపై సోషల్ మీడియా ప్రభావం కేవలం హైప్ మాత్రమేనని స్పష్టం చేశాయి. సోషల్ మీడియాకి సంబంధించి ప్రచారంలో ఉన్నదంతా అపోహ మాత్రమేనని సర్వే పేర్కొంది.

తాజా  ఎన్నికల్లో బీజేపీయే గెలవడానికి మూడు రకాల ఓటర్లను లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీతి సంస్థ ప్రస్తావించింది. సోషల్ మీడియాతో బాగా మమేకం (హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్) అయినవారిలో 43 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు.  మోడరేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్ ఉన్నవారిలో 39 శాతం మంది కమలం పార్టీ వైపు మొగ్గు చూపారు. కాగా, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఎక్కువ సమయం గడపనివారు, బాగా తక్కువ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్ ఉన్నవారిలో 37 శాతం మంది బీజేపీని బలపరిచారు. ఇక, సోషల్ మీడియా ప్రభావం ఏమాత్రం లేని వారిలో 36 శాతం మంది కమలానికి అనుకూలంగా ఓటేసినట్లు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీతి–సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ సర్వే డేటా సహా వివరించింది.  మొత్తం ఓటర్లలో సోషల్ మీడియాతో హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్ ఉన్నవారు కేవలం 10 శాతం మాత్రమే ఉంటారు.  అసలు సోషల్ మీడియా ప్రభావమే పడనివారు మొత్తం ఓటర్లలో 64 శాతం ఉన్నట్లు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీతి సంస్థ వివరించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కేవలం సోషల్ మీడియా వల్లనే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందనడం ఏమాత్రం కరెక్ట్ కాదంటోంది సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ సర్వే.  సోషల్ మీడియాను పక్కన పెట్టినా కమలం పార్టీ విజయం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ప్రభావంపై పెరిగిన అంచనాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన లేదు. పార్టీల జయాపజయాలపై సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్స్ ఏమీ లేదని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండూ  సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకున్నాయి. 2014తో పోలిస్తే 2019 నాటికి సోషల్ మీడియాని వాడుకునే విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే అడ్వాంటేజ్ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇదొక ఆసక్తికరమైన అంశం. ప్రత్యేకంగా ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్ల విషయానికొస్తే మరికొన్ని అంశాలు బయటపడ్డాయి. 2019 నాటికి బీజేపీ వైపు మొగ్గు చూపినవాళ్లలో ఎక్కువమంది  ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు లేనివాళ్లేనని సర్వే స్పష్టం చేసింది. అసలు ఫేస్ బుక్ అకౌంటే లేనివాళ్ల లెక్కలు తీస్తే బీజేపీ ఓట్ షేర్ ఏడు శాతం నుంచి 16 శాతం పెరిగినట్లు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీతి – సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. ప్రతి రోజూ ఫేస్ బుక్ ఉపయోగించే వారిలో బీజేపీ ఓట్ షేర్ 2014 నాటికి 27 శాతం ఉంటే, 2019 నాటికి 21 శాతానికి తగ్గిందని తెలియచేసింది. ట్విట్టర్ యూజర్ల లెక్కలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. టోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించడంలో సోషల్ మీడియా పాత్ర నామమాత్రమేనని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.

‘పొలిటికల్ బిహేవియర్ అండ్ సోషల్ మీడియా’ అనే అంశంపై  2014, 2017, 2018తో పాటు 2019లో నిర్వహించిన అనేక సర్వేల ఫలితాలను ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)’ స్టడీ చేసింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో తెరమీదకు వచ్చిన ‘చౌకీదార్ చోర్ హై’, ‘మై భీ చౌకీదార్’ వంటి నినాదాల ప్రభావాన్ని కూడా ఈ సంస్థ స్టడీ చేసింది. ఈ రెండు నినాదాలు సోషల్ మీడియాలో 80 శాతం పైగా స్పేస్ ఆక్రమించాయి. ఈ మీడియాతో అసలేమాత్రం సంబంధం లేనివారు ఎక్కువ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. దాదాపు 50 శాతం మంది చౌకీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లోగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రియాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లుగా సర్వే స్పష్టం చేసింది.

ఎన్ని లైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు? ఎంతమంది ఫాలోయర్లు?

ఒకప్పుడు రాజకీయ పార్టీలు తమ సిద్దాంతాల ప్రచారానికి  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపైనే ఆధారపడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది.  వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాంల ప్రభావం పెరిగింది. సామాన్య ప్రజల్లో సోషల్ మీడియాకి ఆదరణ పెరగడంతో రాజకీయ పార్టీలుకూడా  దృష్టి పెట్టాయి. సహజంగా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి ఆ వ్యక్తికి ఉన్న పలుకుబడి, కులాల లెక్కలు, ఎంత ఖర్చు పెట్టగలరు ఇలాంటి అంశాలనే రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకుంటాయి. సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి మారింది. కొన్ని రాష్ట్రాల్లోనయితే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చూసే టికెట్లు ఇస్తామని రెండేళ్ల కిందట ఒక రాజకీయ పార్టీ తేల్చి చెప్పింది. ఫేస్ బుక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కనీసం 15 వేల లైకులుండాలని షరతు పెట్టింది.  ట్విట్టర్ ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం ఐదు వేల మంది ఉండాలన్నది మరో కండిషన్. టికెట్లు కావాలనుకున్న వారు తమ ఫేస్ బుక్, ట్విట్టర్ వివరాలను పార్టీ హై కమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తెలియచేయాలని పేర్కొంది.

ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా ఓ సోషల్ మీడియా సెల్ఉండటం ఇటీవల కామనై పోయింది. తమ ఐడియాలజీ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల విమర్శలను దీటుగా ఎదుర్కోవడానికి, వారిపై ప్రత్యారోపణలు చేయడానికి సోషల్ మీడియాను వాడుకోవడం మొదలైంది.

అరచేతిలో ప్రపంచం

సోషల్ మీడియా ప్రభావాన్ని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు.స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు చౌకలో ఉండడం తదితర కారణాలతో సోషల్ మీడియా హవా మొదలైంది. కూర్చున్న చోటనే ప్రపంచంలో ఎక్కడేం జరుగుతోందో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసే సదుపాయం అరచేతిలోకి వచ్చేసింది.  2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ సోషల్ మీడియాపైనే  ఎక్కువగా ఆధారపడ్డారు.యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దాదాపు ఆక్రమించేసింది. దేశవ్యాప్తంగా హల్ చల్ చేసిన అనేక సంఘటనలకు సోషల్ మీడియా ప్రభావమే కారణం. ఎంత పెద్ద ఉద్యమమైనా, ప్రదర్శన అయినా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయంటే యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సోషల్ మీడియాకున్న  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయన్సే కారణంగా చెప్పుకోవాలి. నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ఇస్తే చాలు, క్షణాల్లో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోతోంది. వేలాది మంది పోగయి ఊరేగింపులు తీస్తారు. ధర్నాలు నిర్వహిస్తారు. ఇప్పటికైతే సోషల్ మీడియా ప్రభావాన్ని అంగీకరించి తీరాల్సిందే.