తప్పులు లేకుండా ఓటరు జాబితా : మాయాదేవి

  •     రోల్​అబ్జర్వర్​ బాల మాయాదేవి 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితాకు ఆఫీసర్లు కృషి చేయాలని రోల్​ అబ్జర్వర్​ బాల మాయాదేవి అన్నారు. కొత్తగూడెం  కలెక్టరేట్‌లో నియోజకవర్గ రిటర్నింగ్​అధికారులు, స్వీప్​ నోడల్​ అధికారి, తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.  ఎన్నికల నిర్వహణలో ఓటు జాబితానే కీలకమని అన్నారు.  జిల్లాలో 21,194 మంది కొత్త ఓటర్లు  నమోదు అయ్యారని తెలిపారు. 18 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా  నమోదు కావాలన్నారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందిస్తున్న ఓటరు జాబితాలో అక్టోబర్​1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  ఓటరు జాబితాలో జరిగిన మార్పులపై మరోసారి సమీక్షించాలన్నారు. 2023 జనాభా నిష్పత్తి ఆధారంగా ఓటరు జాబితా రూపొందిస్తున్నామన్నారు.  జిల్లాలో 9,28,983 మంది ఓటర్ల నమోదు జరిగిందన్నారు.  

ALSO  READ :-  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు

జిల్లాలో 1,095 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఓటరు జాబితాలోని చేర్పులు, తొలగింపుల రికార్డులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల రిటర్నింగ్​ అధికారులు ప్రతీక్​ జైన్​, రాంబాబు, శిరీష, కాశయ్య, మంగిలాల్​, స్వీప్​ నోడల్​ అధికారి మధుసూదన్​రాజు, డీఆర్వో రవీంద్రనాద్​, పర్యవేక్షకులు ప్రసాద్​, రంగ ప్రసాద్​, తహసీల్దార్లు పాల్గొన్నారు.