పర్వతగిరి, వెలుగు : ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్లు ఆర్డీఎఫ్ స్టూడెంట్లు ఎంపికయ్యారు. స్కూల్‌కు చెందిన ఎ.అభినవ్, వివేక్ వైజాగ్‌లో జరిగిన షాటోకాన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
వీరిద్దరు ఏప్రిల్26న దుబాయ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ పోటీలకు హాజరుకానున్నారు. స్టూడెంట్లను హెచ్‌ఎం బాషబోయిన రాములు, పీఈటీ రమేశ్, బాలరాజు అభినందించారు.