రోల్స్ రాయిస్ భారతదేశంలో కల్లినన్ సిరీస్ 2 కారును శుక్రవారం చెన్నైలో లాంచ్ చేసింది. ఈ లగ్జరీ ఎస్యూవీ అనేక కొత్త సదుపాయాలు, డిజైన్ మార్పులు, కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని తెలిపింది. కలినన్లో 6.75-లీటర్ ట్విన్-టర్బో వీ12 ఇంజన్ ఉంటుంది. ఇది 563 బీహెచ్పీని, 850 ఎన్ఎం శక్తిని అందిస్తుంది.
కలినన్ సిరీస్ 2 డెలివరీలు ఈ ఏడాది నాలుగో క్వార్టర్లో మొదలవుతాయని కంపెనీ తెలిపింది. దీని ధరలు రూ. 10.50 కోట్లతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి. బ్లాక్ బ్యాడ్జ్ కలినన్ సిరీస్ 2 ప్రారంభ ధర రూ. 12.25 కోట్ల (ఎక్స్-షోరూమ్)ని రోల్స్ రాయిస్ తెలిపింది.