- రాల్‌ప్రో టెక్నో క్రాఫ్ట్స్ ఫ్యాక్టరీకి పీసీబీ ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అల్యూమినియం ఉత్పత్తులు తయారు చేసే రాల్‌ప్రో టెక్నో క్రాఫ్ట్స్ పరిశ్రమ మూసీలోకి వ్యర్థాలు వదులుతుండడంతో మూసెయ్యాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ బ్రిడ్జి సమీపంలోని నక్కవాగులోకి ట్యాంకర్ ద్వారా వ్యర్థాలు వదులుతున్నారని గుర్తించిన పీసీబీ అధికారులు తనిఖీలు చేసి నవంబర్ 29న పట్టుకున్నారు. వాగు, ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా ఆల్కలీన్ స్వభావం కలిగిన వ్యర్థాలు ఉన్నట్టు నిర్ధారించారు. శుక్రవారం రాల్‌ప్రో టెక్నో క్రాఫ్ట్స్ ని మూసివేయాలంటూ నోటీసులు జారీ చేశారు.