ఇటలీలో చిక్కుకున్న భారతీయులతో బయలుదేరిన విమానం ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. ఇటలీలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో అక్కడున్న భారతీయులు ఇంటిబాట పట్టారు. కానీ, వారు ఇండియాకు రావడానికి విమానాలు లేకపోవడంతో నాలుగు రోజులుగా ఎయిర్ పోర్టులోనే పడిగాపులుకాస్తున్నారు. వారికోసం భారత ప్రభుత్వం నిన్న ఎయిర్ ఇండియా విమానాన్ని రోమ్‌కి పంపించింది. దాంతో 263 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఈ రోజు(ఆదివారం) ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఢిల్లీలో ల్యాండయింది. ఈ విమానంలో వచ్చినవారిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత చావ్లాలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులచే నిర్వహించబడుతున్న క్వారంటైన్‌కు తీసుకువెళతారు.
ఇటలీ నుండి వచ్చిన భారతీయులలో ఇది రెండవ బ్యాచ్. కొన్ని రోజుల క్రితం 218 మంది భారతీయులతో మిలాన్ నుంచి మొదటి బ్యాచ్ ఢిల్లీకి వచ్చింది.
For More News..