హైదరాబాద్, వెలుగు: కరెంటు సమస్యలను యద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఎనర్జీ సెక్రటరీ, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మింట్ కాంపౌండ్‌లోని సదరన్ డిస్కం కార్పొరేట్ ఆఫీసులో సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడారు.
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ నిత్యం వినియోగదారులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. చీఫ్ఇంజినీర్లు, ఎస్ఈలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా ప్రతినిధులు, వినియోగదారులతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.