తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా రోనాల్డ్ రాస్ ను నియమించారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న లోకేష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ముషారఫ్ అలీని నియమించింది. రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ ను నియమించింది.