హోటల్ గదులను తలదన్నేలా సకల సౌకర్యాలు.. అద్దె మాత్రం 15 రూపాయలు

హోటల్ గదులను తలదన్నేలా సకల సౌకర్యాలు.. అద్దె మాత్రం 15 రూపాయలు

దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెల చివరన చేతికొచ్చే జీతంలో సగం డబ్బులు అద్దెకే చెల్లించాల్సిన పరిస్థితి. ఈ ఇంటి అద్దెలు చెల్లించలేక సగం మంది రోడ్ల వెంబడి పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుంటారు. అలాంటి మన మాతృ దేశంలో తాను ఉంటున్న గదికి కేవలం 15 రూపాయల అద్దె మాత్రమే చెల్లిస్తున్నట్టు ఓ నెటిజెన్ నెట్టింట పోస్ట్ చేశాడు. నమ్మడానికే అవకాశం లేని ఈ కథనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బీహార్‌కు చెందిన అమన్ అనే విద్యార్థి AIIMS కళ్యాణి(పశ్చిమ బెంగాల్‌)లో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతను ఉంటున్న గది అద్దె కేవలం 15 రూపాయలట. ఈ విషయాన్ని అతనే తెలియజేశాడు. పడుకోవటానికి బెడ్, బట్టలు పెట్టుకోవడానికి కప్‪బోర్డ్స్, చదువుకోవడానికి అవసరమైన రీడింగ్ టేబుల్, అటాచ్‌డ్ మోడ్రన్ వాష్ రూమ్.. గదిలో ఇన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోను అతను నెట్టింట పోస్ట్ చేశాడు. కాకపోతే, ఇక్కడే ఓ మెలిక ఉంది. 

తక్కువ అద్దె వెనుక రహస్యమిదే

నమ్మశక్యం కాని ఈ తక్కువ అద్దె వెనుక రహస్యం ఏమిటంటే, ఇదొక ప్రభుత్వ భవనం. AIIMSలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం గృహాలను కట్టించింది. అందువల్లే, అంత తక్కువ అద్దె. ఈ వీడియో కొందరు నెటిజనులకు అసూయను రేకెత్తిస్తోంది. AIIMS వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకోవడం వల్ల కలిగే ప్రోత్సాహకాలను చూసి కొందరు ఏడుస్తున్నారు.

ALSO READ | బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్లో 184 మంది ప్రయాణికులు..