లండన్: శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మాజీ కెప్టెన్ జో రూట్ (143) సెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 358/7 స్కోరు చేసింది. గస్ అట్కిన్సన్ (74 బ్యాటింగ్), మాథ్యూ పాట్స్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది.
డకెట్ (40) నిలకడగా ఆడినా, డాన్ లారెన్స్ (9), ఒలీ పోప్ (1) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో రూట్ కీలక భాగస్వామ్యాలు జోడించాడు. డకెట్‌తో మూడో వికెట్‌కు 40, హ్యారీ బ్రూక్ (33)తో నాలుగో వికెట్‌కు 48, జెమీ స్మిత్ (21)తో ఐదో వికెట్‌కు 62, అట్కిన్సన్‌తో ఏడో వికెట్‌కు 92 రన్స్ జోడించి భారీ స్కోరు అందించాడు. చివర్లో అట్కిన్సన్, పాట్స్ ఎనిమిదో వికెట్‌కు 50 రన్స్ జత చేశారు. అషితా, మిలాన్, లాహిరు తలా రెండు వికెట్లు తీశారు.