IND vs ENG 4th Test: ఒక్కడే అడ్డుకున్నాడు: అర్ధ సెంచరీతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్న రూట్

IND vs ENG 4th Test: ఒక్కడే అడ్డుకున్నాడు: అర్ధ సెంచరీతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్న రూట్

రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ కోలుకుంది. సిరీస్ లో ఇప్పటివరకు విఫలమైన స్టార్ బ్యాటర్ రూట్.. కీలకమైన నాలుగో టెస్టులో సత్తా చాటాడు. రూట్ కు తోడు  బెన్ ఫోక్స్ చక్కని సహకారం అందించడంతో ఇంగ్లీష్ జట్టు టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (67) ఫోక్స్ (28) ఉన్నారు. టీ విరామం తర్వాత భారత బౌలర్లు రూట్ వికెట్ ఎంత త్వరగా తీస్తే రోహిత్ సేన మ్యాచ్ పై పట్టు బిగించవచ్చు.  

5 వికెట్లకు 112 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్.. భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. రూట్, ఫోక్స్ ఎక్కడా చెత్త షాట్స్ కు పోకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. దీంతో స్కోర్ వేగం మందగించినా.. ఇంగ్లాండ్ విలువైన వికెట్ ను కాపాడుకుంది. ఈ సెషన్ లో రూట్ తన బ్యాటింగ్ వేగాన్ని పెంచినా.. మరో ఎండ్ లో ఫోక్స్ డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో రూట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోడీ 35 ఓవర్ల పాటు భారత బౌలర్లను అడ్డుకున్నారు.
 
ఆరో వికెట్ కు ఈ జోడీ అజేయంగా 221 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అంతకముందు భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ ఆడుతున్న ఆకాష్ దీప్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.