ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ వ్యక్తిగత మైలురాళ్లను సృష్టిస్తూనే ఉన్నాడు. నీళ్లు తాగినంత సులభంగా సెంచరీలు బాదేస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. దిగ్గజ క్రికెటర్ల వ్యక్తిగత రికార్డును ఒక్కొక్కటిగా అధిగమిస్తూ పోతున్నాడు. శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్‌తో కెరీర్‌లో ఆరో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న రూట్.. భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
ALSO READ | IND vs BAN 2024: సచిన్ రికార్డ్‌పై కన్నేసిన బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్
కెరీర్ మొత్తం 200 టెస్టులు ఆడిన సచిన్ టెస్టుల్లో ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకోగా.. ఆ రికార్డును జో రూట్ 146 టెస్టుల్లోనే అధిగమించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు:
- 1. ముత్తయ్య మురళీధరన్: 11
- 2. రవిచంద్రన్ అశ్విన్: 10
- 3. జాక్వెస్ కల్లిస్: 9
- 4. ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హ్యాడ్లీ మరియు షేన్ వార్న్: 8
- 5. వసీం అక్రమ్ మరియు శివనారాయణ్ చంద్రపాల్: 7
- 6. మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వా, జో రూట్: 6
- 7. సచిన్ టెండూల్కర్: 5
కాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.