ఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై ఫిర్యాదు చేస్తం

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలంలో గులాబీ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ పై అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పని చేసే వారిని ఎమ్మెల్యే హరిప్రియ గుర్తించడం లేదని, ఎమ్మెల్యే హరిప్రియతోపాటు ఆమె భర్త అయిన మార్కెట్ చైర్మన్ హరిసింగ్ ఒంటెద్దు పోకడలతో తాము విసిగిపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే హరిప్రియ దంపతుల తీరుతో బయ్యారం మండలంలో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వారు ఆరోపించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తామని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నేతలు చెబుతున్నారు.