
హీరో శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ (Roshan) కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) డైరెక్షన్లో తెరకెక్కనున్న ఛాంపియన్ (Champion) సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
నేడు గురువారం (మార్చి 13న) హీరో రోషన్ బర్త్డే స్పెషల్గా 'ఛాంపియన్' గ్లింప్స్ విడుదల చేశారు. ఈ మూవీ విభిన్నమైన లవ్ స్టోరీతో పాటు స్పోర్ట్స్ నేపథ్యంలో రానున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులోని రోషన్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 38 సెకన్ల పాటు సాగిన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాలిడ్గా ఉంది.
ఇక ఈ సినిమాతో రోషన్ లోని నటనను బయటకు తీసుకురావడానికి వైజయింతి బ్యానర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ చేసిన, ఫస్ట్ లుక్ పోస్టర్, లేటెస్ట్ గ్లింప్స్ నిరూపిస్తున్నాయి. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ALSO READ | OTT Crime Thriller: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - ఎక్కడ చూడాలంటే?
స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ మూవీతో పాటు కన్నడ డైరెక్టర్ నంద కిషోర్ (Nanda Kishore) తో రోషన్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కు వృషభ (Vrushabha) అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) రోషన్ కి తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. పీరియాడికల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. రోషన్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
The game begins now… and the #Champion has arrived ⚽️
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2025
Wishing our 'Champ' #Roshan a very Happy Birthday.https://t.co/QzG6GaUpw2@PradeepAdvaitam @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms #AnandiArtCreations #Concept @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/rU7Skoqkk6