నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ (Anchor Suma) కొడుకు రోషన్ (Roshan Kanakala) హీరోగా సినిమా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన మూవీ బబుల్ గమ్ (Bubblegum). సరికొత్త టైటిల్ తో ఇవాళ డిసెంబర్ 29న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ డైరెక్టర్ రవికాంత్ పెరేపు (Ravikanth Perepu) తెరకెక్కించారు. ఎన్నోస్టేజీలపైనా టాలీవుడ్ హీరోస్కి యాంకరింగ్ చేసిన సుమ..ఇపుడు తన కొడుకు ఎంట్రీ కోసం ఎలాంటి మూవీ సెలెక్ట్ చేసిందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి?
ఈ సినిమా మొదలు పెట్టిన నుంచి మేకర్స్ చెప్తు వస్తున్న మాట..యూత్కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని. అన్నట్టుగానే ఇదొక యూత్ డ్రామా ఫిల్మ్. కథలోకి వెళితే ఒక పక్కా హైదరాబాదీ కుర్రాడు ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల). తనకున్న గోల్ డీజే. అలా పబ్ల్లో డీజే సాంగ్స్ బీట్స్ తో..రెచ్చిపోయే కుర్రాడి లైఫ్ లోకి జాన్వీ(మానస చౌదరి) తారసపడుతుంది. చూడగ్గానే ఆది మనసుకు నచ్చేస్తుంది. జాన్వీ ఓ పెద్దింటి అమ్మాయి కావడం వల్ల ..అబ్బాయిలని ఓ టాయ్ లాగా ట్రీట్ చేస్తుంది. జాన్వీ మోడర్న్ అమ్మాయి అవ్వడంతో..ఆది లవ్ని అంత తొందరగా నమ్మదు. ఇలాంటి అమ్మాయి అనుకోకుండా ఆదిని లవ్ చేస్తుంది.
ఆది డీజే పనితీరుకు అట్ట్రాక్ట్ అయిన జాన్వీ..ఒక ఫంక్షన్ లో తొందరపాటు వల్ల ఆదిని అతి దారుణంగా అవమానిస్తుంది. ఎంతలా అంటే పార్టీలోనే, ఆది బట్టలు విప్పి దారుణంగా అవమానిస్తుంది. మరి ఇంతలా అవమానించడానికి కారణం ఏంటీ? జాన్వీ చేసిన ఆ అవమానాన్ని ఆది ఎలా తన మనసుకి తీసుకున్నాడు? ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఈ జంట..చివరికి ఒక్కటయ్యారా? లేదా? అనేది బబుల్‌గమ్ కథ.
ఎలా ఉంది?
ప్రేమ బబుల్‌గమ్ లాంటిది..మొదట్ల తీయగుంటది..ఆ తర్వాత అంటుకుంటది..షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్ పండవెట్టేస్తది..అంటూ సాగే డైలాగ్స్..సినిమా ఎలా పెట్టారో..అలానే ఉంటుంది. పేద, ధనిక యువత జీవన శైలి..ప్రస్తుతం ఎలా ఉంది. ప్రేమ, పెళ్లి, బ్రేకప్.. రిలేషన్లో ఏవైనా ఆటంకాలు ఎదురైతే..నేటి యువత ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది..ఈ సినిమాలో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
హీరో..హీరోయిన్స్ మధ్య ప్రేమ..ముద్దులు, హగ్గులు..కొన్నాళ్లకు గొడవలు..ఇలా దాదాపు..ప్రస్తుతం వచ్చే సినిమాల్లో చూస్తూ వస్తున్నాం.కానీ వాటికి భిన్నంగా బబుల్ గమ్ ఎంటర్టైన్మెంట్తో..కథనం సాగించడంలో డైరెక్టర్ దృష్టి పెట్టాడు.
సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే..ఇంట్రడక్షన్ ఫైట్‌తో హీరో పరిచయం..ఫ్యామిలీ..ఫ్రెండ్స్..ఇవన్నీ చూపిస్తాడు. ఆ ఆతర్వాత హీరో ఓ డీజే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ..ఎప్పటికైనా తాను ఒక పెద్ద డీజే కావాలని కలలు కనడం..ఇక ఇంట్లో ఎప్పుడూ తిట్టే తండ్రి (చైతూ జొన్నలగడ్డ), ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి..బయటికి వస్తే ఓ ఇద్దరు ఫ్రెండ్స్..అనుకోకుండా పబ్ లో జాన్వీ ఎంట్రీ..ఇవన్నీ చూస్తుంటే సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు చూసిన ఫీలింగ్ వస్తోంది.
ఆమె రొమాన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఆ సీన్స్ చాలా వరకు లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో నింపేశారు డైరెక్టర్. జాన్వీ..ఆది ఫ్రెండ్స్గా పరిచయం అవ్వడం..ఇక ప్రేమలో పడడం..లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో రెచ్చిపోవడంతో యూత్ కనెక్ట్ అయ్యేలా సీన్స్ ఉండటం..ఇలా స్టోరీ సరదాగా సాగుతుంది. ఇక వెంటనే హీరోని హీరోయిన్ అవమానించే సీన్..ఆ తర్వాత తన తప్పును తెలుసుకునే సీన్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ అవ్వడం..ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు డైరెక్టర్.
అలాంటి బ్రేకప్ టైములో ఇజ్జత్ అనే సాంగ్ పెట్టడంతో..యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు డైరెక్టర్. ఎందుకంటే..ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో రోషన్ కళ్ళకు కట్టినట్లుగా నటించాడు. ఇదే క్రమంలో హీరో తండ్రి మాటలు యూత్ లో స్ఫూర్తిని ఇచ్చేలా..మనసులకు హత్తుకునేలా చేశాడు. అలాగే సెకండాఫ్ లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ప్రతి సీన్ ఆడియాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫస్టాఫ్ లో ఉన్న ప్రేమకథ కాస్త..సెకండాఫ్ లో రివేంజ్ డ్రామాగా మారుతోంది. ఇక చివర్లో రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవ్వడం..అక్కడక్కడ బూతు డైలాగ్స్ ఉండడం ఆడియన్స్ కు కొద్దిగా పరీక్ష పెట్టేలా చేస్తుంది.
ఎవరెలా చేశారంటే:
నా డెస్టినీలో ఏం రాసిపెట్టిందో నాకు తెల్వదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అలాగే ప్రేమ బబుల్ గమ్ లాంటిది..మొదట్ల తీయగుంటది..ఆ తర్వాత అంటుకుంటది..షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్ పండవెట్టేస్తది..ఇలా కొన్ని డైలాగ్స్ థియేటర్లో ఆడియాన్స్ చేత విజిల్స్ కొట్టిస్తాయి. హీరో రోషన్ కనకాల డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ సీన్స్ లో ఇచ్చే పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొత్త వాడైనా చాలా బాగా నటించాడు. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆది పాత్రలో రోషన్ చక్కగా ఒదిగిపోయాడు. డెబ్యూ మూవీ అయిన..ఎలాంటి కెమెరా భయం లేకుండా నటించాడు. జాన్వీగా నటించిన హీరోయిన్ మానస చౌదరి అందంతోనూ..అభినయంతోనూ ఫస్టాఫ్ లో ఆకట్టుకుంది.రొమాంటిక్స్ సీన్స్‌లో రెచ్చిపోయింది. మిగతా కొన్ని సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో మాత్రం తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.హీరో తండ్రి పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డ.. కామెడీ టైమింగ్‌తో..ఎమోషన్ సీన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. హర్షవర్థన్, అనుహాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడకపోవడంతో కాస్తా ఫర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్ విషయాలకొస్తే..
క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవికాంత్ పెరేపు..ఈ సినిమాను యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. ఈ సినిమాలో దాదాపు అందరి కొత్త నటులను తీసుకుని సాహసం చేశాడు. అయిన సరే..కొత్త వారి నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో పైచేయి సాధించాడు. ఇంకాస్తా బబుల్ గమ్' సినిమా విషయంలో ఫోకస్ పెడితే బాగుండేది. శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఇజ్జత్ సాంగ్, జిలేబీ సాంగ్ ఆకట్టుకుంటోంది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.