పంచెకట్టులో రోషన్ కనకాల.. ఆసక్తి పెంచిన మోగ్లీ 2025

పంచెకట్టులో రోషన్ కనకాల.. ఆసక్తి పెంచిన మోగ్లీ 2025

రోషన్ కనకాల హీరోగా  నటిస్తున్న  చిత్రం ‘మోగ్లీ 2025’.  ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్  సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. శనివారం రోషన్ బర్త్‌‌‌‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  డిఫరెంట్ గెటప్‌‌‌‌తో  ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు రోషన్. 

పంచె కట్టుతో  మెడలో గద లాకెట్‌‌‌‌తో కనిపిస్తున్న తన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  లవ్‌‌‌‌స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌‌‌‌తో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రంతో  సాక్షి సాగర్‌‌‌‌ మదోల్కర్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా పరిచయమవుతోంది.  కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.