హైదరాబాద్, వెలుగు: లగ్జరీ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ అమ్మే 'రోస్సో బ్రూనెల్లో' హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో స్టోర్‌ను ప్రారంభించింది. ఇటాలియన్ శైలిలో తమ బూట్లు ఉంటాయని, డిజైన్లు చాలా బాగుంటాయని సంస్థ తెలిపింది. ప్రారంభ ధర పురుషులకు రూ. 8,999, మహిళలకు రూ.5,999 నుంచి ఉంటుంది.
ప్రతి షూ ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో గల బ్రాండ్ డిజైన్ స్టూడియో నుంచి వస్తుందని, అన్నింటిని చేతితోనే తయారు చేస్తామని రోస్సో తెలిపింది. ఇక్కడ బూట్లతోపాటు మొకాసిన్స్, లోఫర్లు, లెస్-అప్‌లు, చెప్పులు, మ్యూల్స్, హీల్స్, ఫ్లాట్‌లు, వెడ్జెస్, మ్యూల్స్, బెల్టులు ఉంటాయి.