పాట్నాలో నిరసనకారుల రైల్ రోకో..BPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దుకు డిమాండ్

పాట్నాలో నిరసనకారుల రైల్ రోకో..BPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దుకు డిమాండ్

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉదృతమైంది. ఇప్పటికు పలు పార్టీలు అభ్యర్థులు ఆందోళనకు మద్దతినిచ్చాయి. గురువారం జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీపీస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.. శుక్రవారం నాడు అభ్యర్థులు ఆందోళనను ఉదృతం చేశారు.. ఇండిపెండెంట్ ఎంపి పప్పు యాదవ, ఛత్ర యువశక్తి మద్దతుదారులు రైళ్లను నిలిపివేశారు. సచివాలయ హాల్ట్ వద్ద రైలును నిలిపివేశారు. 

గత కొద్ది రోజులుగా బీపీఎస్సీ 2024 ఎగ్జామ్ ను రద్దు చేయాలని.. తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. వేలాదిమంది అభ్యర్థులు బీహార్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. బీపీఎస్సీ నిర్వహించిన 70వ ఇంటిగ్రేటెడ్ కాంపిటిటివ్ (ప్రిలిమినరీ ) ఎగ్జామ్ 2024ని ర్దుద చేరయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఛత్ర యువశక్తి మద్దతుదారులు సచివాలయ హాల్ట్ వద్ద రైలును అడ్డుకున్నారు. 

ALSO READ | మీ ఆధార్ నెంబర్‌పై వేరే వాళ్లు సిమ్‌ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి

70వ ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటేటివ్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ (CCE), 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరియు ఛత్ర యువ శక్తి సచివాలయ హాల్ట్ వద్ద రైలును అడ్డుకున్నారు.