మనసుకు హత్తుకునే ఎమోషన్‌‌‌‌‌‌‌‌తో..

మనసుకు హత్తుకునే ఎమోషన్‌‌‌‌‌‌‌‌తో..

యువతరానికి నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ‘రోటి కపడా రొమాన్స్‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్ని రూపొందించామన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. సృజన్‌‌‌‌‌‌‌‌ కుమార్ బొజ్జంతో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు.  నవంబరు 22న సినిమా విడుదల కానుంది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో బెక్కెం వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ‘రొమాన్స్‌‌‌‌‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ప్రతి పాత్ర అందరికీ కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యేలా ఉంటుంది.   తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త తరహాలో సాగే యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది.  ప్రతి సీన్‌‌‌‌‌‌‌‌లోనూ ఎమోషన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అందరి మనసులకు హత్తుకుంటుంది’ అని చెప్పాడు.  హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సంగీత దర్శకుడు ఆర్‌‌‌‌‌‌‌‌.ఆర్‌‌‌‌‌‌‌‌. ధ్రువన్‌‌‌‌‌‌‌‌, డీవోపీ సంతోష్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నిర్మాత సృజన్‌‌‌‌‌‌‌‌ బొజ్జం 
తదితరులు పాల్గొన్నారు.