జగిత్యాల టౌన్/ మేడిపల్లి, వెలుగు : అంగన్ వాడీ సెంటర్ పంపిణీ చేసిన కోడి గుడ్లు కుళ్లిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మేడిపల్లి మండలం వల్లంపల్లి అంగన్ వాడీ సెంటర్ గర్భిణులు, బాలింతలకు కోడి గుడ్లను పంపిణీ చేశారు.
ఇంటికి వెళ్లి చూడగా కోడి గుడ్లు కుళ్లిపోయి కనిపించాయి. దీంతో అధికారుల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. అంగన్ వాడీ కేంద్రంలో ఎలుకలు కూడా ఉన్నాయని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.