గండీడ్, వెలుగు: మండలంలోని వెన్నచెడ్ విలేజ్ అంగన్వాడీ సెకండ్ సెంటర్లో గ్రామానికి చెందిన మేఘన కూతురు అద్వైకకు డిసెంబర్ 25న ఇచ్చిన 8 గుడ్లను మంగళవారం ఉడకబెట్టగా 4 గుడ్లు కుళ్లిపోయి, పురుగులు పడి కనిపించాయి.
పాప తండ్రి ఈ విషయమై టీచర్ను నిలదీశాడు. గుడ్లు, బాలమృతం తనకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుందని, ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్ విజయమ్మను వివరణ కోరగా, ఇటీవల ఇచ్చిన గుడ్లు కావని, ఎప్పుడో ఇచ్చిన గుడ్లు ఫ్రిజ్లో నిల్వ పెట్టి వాడుకోవడం వల్ల కుళ్లిపోయాయని చెప్పారు. గ్రామంలో ఎవరూ గుడ్లు కుళ్లిపోయాయని చెప్పడం లేదన్నారు.