హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం అంగన్ వాడీ సెంటర్ లో గురువారం కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు నిలదీయడంతో తర్వాత మంచివి ఇచ్చారు. దీనిపై సీడీపీఓ నాగమణిని వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కేశంపేట మండలం కొత్తపేట అంగన్ వాడీ సెంటర్ లో ఎక్స్పైర్ అయిన పాలు ఇవ్వడంతో అవి తాగిన చిన్నారి ఆస్పత్రి పాలయ్యాడు. తరచూ ఏదోక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.