కుళ్లిన మాంసం.. బూజు పట్టిన స్వీట్లు .. వెంకటేశ్వర స్వీట్ హోమ్​కు నోటీసులు

కుళ్లిన మాంసం.. బూజు పట్టిన స్వీట్లు .. వెంకటేశ్వర స్వీట్ హోమ్​కు నోటీసులు
  • మామ్స్ కిచెన్ అండ్ రెస్టారెంట్​కు రూ.5 వేల జరిమానా

ఆదిలాబాద్, వెలుగు: కుళ్లిన మాంసం, బూజు పట్టిన స్వీట్లను రోజుల తరబడి ఫ్రీజర్​లో ఉంచి వ్యాపారం చేస్తున్న ఘటన బయటపడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ శానిటరీ అధికారుల తనిఖీలు చేశారు. శానిటరీ ఇన్​స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో మామ్స్ కిచెన్ అండ్ రెస్టారెంట్​లో ఫ్రీజర్​లో ఉంచిన చికెన్, మటన్ మాంసపు నిల్వలను గుర్తించారు. ఫ్రీజర్ తీయగానే దుర్వాసన రావడంతో కంగుతిన్నారు. 

మాంసం కుళ్లిపోయి.. దుర్వాసన వస్తున్నా వంటకాల్లో అదే వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని రెస్టారెంట్ నిర్వాహకులపై ఇన్​స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్​కు రూ.5 వేల జరిమానా విధించారు. ఇక రైతు బజార్ సమీపంలోని వెంకటేశ్వర స్వీట్ హోమ్​లో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ శానిటరీ అధికారులు.. బూజుపట్టిన స్వీట్ పదార్థాలు గుర్తించారు. నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చి నోటీసులు అందజేశారు.