అరేబియన్​ మండీలో కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం

అరేబియన్​ మండీలో కుళ్లిన, పురుగులు పట్టిన మాంసం
  •     కాటేదాన్ ​ఆయిల్​ కంపెనీల్లో లేబుల్స్​ లేని ఆయిల్

హైదరాబాద్, వెలుగు :గ్రేటర్​సిటీలో ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నా హోటళ్ల నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. శుక్రవారం పాతబస్తీలోని అరేబియన్ మండీలోని ఫ్రిడ్జ్​లో కుళ్లిపోయిన మాంసం, పురుగులు పట్టిన చికెన్​నిల్వలను గుర్తించారు. వంటలో కల్తీ పదార్థాలు వాడుతున్నట్లు బయటపడింది. అధికారులు వాటిని సీజ్​చేసి, హోటల్​కు నోటీసులు ఇచ్చారు.

షాదాబ్​హోటల్ లో పాడైపోయిన వెల్లుల్లి పేస్ట్​నిల్వలను గుర్తించారు. జీరా, డ్రైఫ్రూట్స్​పాడైనవి ఉన్నట్టు తేల్చారు. చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్​అండ్​బేకరీ కిచెన్​లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. కాటేదాన్​లోని భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీలను తనిఖీ చేశారు.

నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. రా మెటీరియల్లో పురుగులు కనిపించాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆల్ రిచ్​డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్​ కంపెనీలో 263 కిలోల అన్​లేబుల్​నెయ్యిని అధికారులు సీజ్ చేశారు.