న్యూఢిల్లీ : దేశంలోనే తొలిసారిగా చెన్నైలో నైట్ రేస్‌తో రేసింగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) మూడో రౌండ్ కోసం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు తిరిగొస్తోంది. ఐఆర్‌ఎఫ్‌లో భాగంగా ఈ నెల 14, 15వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్),
ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ (ఎఫ్4ఐసీ) మూడో రౌండ్ పోటీలు జరగనున్నాయి. గతవారం చెన్నైలో నైట్ స్ట్రీట్ సర్క్యూట్ రేస్ సక్సెస్‌ను కొనసాగిస్తూ మూడో రౌండ్లో ఆరు జట్లు, డ్రైవర్లు అభిమానులకు మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.