గిరిజన రిజర్వేషన్లపై ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్

గిరిజన రిజర్వేషన్లపై  ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు రిజర్వేషన్లు, ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయంపై గిరిజన రిజర్వేషన్ సాధన సమితి  శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. దీనికి పలు పార్టీల ప్రతినిధులు,  ప్రజా సంఘాల నేతలు అటెండ్ కానున్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయనున్నారు.

ముఖ్యంగా  చట్ట ప్రకారం  రిజర్వేషన్లు అమలు కావడం లేదని వివిధ శాఖల్లో ప్రమోషన్ల విషయంలో గిరిజన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.