వరదల నివారణకు చర్యలు తీసుకోండి

 వరదల నివారణకు చర్యలు తీసుకోండి

 

  • జేఎన్‌‌ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్​ సిటీ, వెలుగు : సిటీలో వరదల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఆదివారం జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా (జేఎన్ఐ) ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘వరదలు లేని హైదరాబాద్’ అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..   భవిష్యత్తులో వరదల నివారణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు.  ప్రజా శ్రేయస్సు కోసం చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు.  

ఇండ్లు కోల్పోయే వారికి ముందుగానే ఇండ్లను కేటాయించాలని, పరిహారం ఇవ్వాలని కోరారు.  సామాజిక వేత్తలు మజర్​హుస్సేన్, బాబురావు, డాక్టర్ పృథ్వీ, తెలంగాణ విఠల్, శంకర్, జేఎంఐ ఆర్గనైజర్లు సురేందర్ కుమ్ముల, ఆకర్ష్​ శ్రీరామోజు, రేణుక వధార, నరేందర్ కలాన్, గౌతమ్ రాగి, బొల్లపల్లి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.