ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలంటూ జైలు అధికారులను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును న్యాయస్థానం కవితకు కల్పించింది. కవిత ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రతిరోజు పత్రికలు అనుమతించాలని ఆదేశించింది కోర్టు.
కుకింగ్ ఆఫ్ బుక్స్, 365 సుడోకు, జయ గోష, మురకమి నార్వింగ్ వుడ్, ది ఆర్‌ఎస్‌ఎస్ రోడ్ మ్యాప్స్ ఫర్మ్ 21ఫస్ట్ సెంచరీ, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్, లివింగ్ ఇన్ ద లైట్ అండ్ పేపర్ క్లబ్, నోట్ బుక్స్ అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇంటి నుంచి ఆహారం, పుస్తకాలు, పరుపులు, స్లిప్పర్స్, దుప్పట్లు తెచ్చునేందుకు, ఆభరణాలు ధరించేందుకు అనుమతించాలని మరోసారి ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
ALSO READ :- తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి : పొన్నం ప్రభాకర్
2024 మార్చి 26వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు కవిత తరపు న్యాయవాదులు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటిని తెచ్చుకునేందుకు కవితకు అనుమతించినట్లు కోర్టుకు తెలిపారు జైలు సూపరిండెంట్. ఈ క్రమంలో మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చింది రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు.