కవితకు దక్కని ఊరట..  జులై 3 వరకు కస్టడీ పొడిగింపు

కవితకు దక్కని ఊరట..  జులై 3 వరకు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో  ఆమెకు  జులై 03 వరకు జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ  రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్  కస్టడీ సోమవారంతో ముగియండంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా  కోర్టు నెల రోజుల పాటు   కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. 

లిక్కర్  కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను హైదరాబాద్​లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే..   ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్  చేసింది. ఈ రెండు కేసుల్లో ట్రయల్  కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.  మరోవైపు లిక్కర్  స్కామ్​లో బెయిల్  మంజూరు చేయాలని కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.