కేజ్రీవాల్​పై కేసు నమోదు చేయండి

కేజ్రీవాల్​పై కేసు నమోదు చేయండి
  • ఢిల్లీ పోలీసులకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం 

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మరో ఇద్దరు నేతలు గులాబ్ సింగ్, నికితా శర్మలు భారీ హోర్డింగ్ ల ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 ఈ నేపథ్యంలో వీరిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ 2019లో లోయర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే, కోర్టు మాత్రం ఆ పిటిషన్ ను విచారించడానికి నిరాకరించింది. దీంతో పిటిషనర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.  దీనిపై మార్చి 18లోగా పూర్తిస్థాయి రిపోర్టును సమర్పించాలని కోరింది. ఆప్ మాత్రం ఆరోపణలను ఖండించింది.