హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్

 హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్

భాగ్యనగరంలో వినాయకుల నిమజ్జనానికి  అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల గుండా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని  హైదరాబాద్ సీపీ CV ఆనంద్  తెలిపారు. నగరంలో ట్రాఫిక్  ఆంక్షల దృష్ణా.. వాహనదారులు అల్టర్నెట్ రూట్లలో వెళ్లాలని సూచించారు.

బాలాపూర్  నుంచి గుర్రం చెరువు ట్యాంక్ పై ఉన్న కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు.. హైదరాబాద్  కమిషనరేట్  పరిధిలోకి ప్రవేశించనుంది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ , MBNR ఎక్స్  రోడ్, ఫలక్ నుమా రైల్వే ఓవర్  బ్రిడ్జ్, ఆలియాబాద్ మీదుగా చార్మినార్ వైపు ప్రధాన ఊరేగింపురానున్నది. చార్మినార్, మదీనా, అఫ్జల్ గంజ్,  MJ మార్కెట్, అబిడ్స్  ఎక్స్  రోడ్ నుంచి బషీర్ బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా  NTR మార్గ్, అంబేడ్కర్  విగ్రహం వైపు శోభాయాత్ర కొనసాగుతుంది. 

సికింద్రాబాద్  నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభాయాత్రం వాహనాలను సంగీత్  థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్  జంక్షన్, MGరోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్  మీదుగా నెక్లెస్  రోడ్డుకు మళ్లించనున్నారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ హాస్పిటల్, RTCఎక్స్ రోడ్, నారాయణగూడ ప్లైఓవర్, Y జంక్షన్, హిమాయత్ నగర్  నుంచి లిబర్టీ వైపు మళ్లించనున్నారు.

మరోవైపు దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చే గణేష్ శోభాయాత్రలను, INS సదన్, సైదాబాద్, చంచల్ గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్  రోడ్డులో కలుస్తుందని చెప్పారు. అక్కడి నుంచి మూసారాంబాగ్ , అంబర్ పేట్  వైపు వెళ్లనున్నాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు OU డిస్టెన్స్ ఎడ్యూకేషన్ రోడ్డు, అడిక్ మెట్  వైపుమీదుగా విద్యానగర్ , ఫీవర్  హాస్పిటల్  దగ్గర ఊరేగింపు చేరుతుందని చెప్పారు.

ఇక ఉప్పల్ నుంచి రామంతాపూర్, శ్రీరమణ జంక్షన్, ఛే నంబర్ మీదుగా గణేష్ శోభయాత్రలు... తిలక్ నగర్, విద్యానగర్  జంక్షన్, ఫీవర్  ఆసుపత్రి, బర్కత్ పుర జంక్షన్ మీదుగా వెళ్లి నారాయణగూడ YMCAకూడలికి చేరుకుంటాయి. ఇక్కడి వాటిని ఆర్టీసీ క్రాస్  రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలపనున్నారు.

రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలను మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్ మీదుగా... నిరంకారి భవన్, ద్వారకా హోటల్  జంక్షన్, ఇక్బాల్  మినార్  మీదుగా ఎన్టీఆర్  మార్గ్ కు చేరుకుంటుందని చెప్పారు. టప్పాచబుత్ర, ఆసిఫ్ నగర్  ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, వోల్గా హోటల్  ఎక్స్ రోడ్, గోషా మహల్, మాలకుంట కూడలి మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి.

ఎర్రగడ్డ నుంచి వచ్చే గణేష్ శోభాయాత్రలు SR నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్  మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్  వద్ద చేరి, ఎన్టీఆర్  మార్గ్  వరకు చేర్చనున్నారు. ఈ రూట్లలో  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.