హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు అధికారులు. దీనిలో భాగంగా 70.కి.మీ మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీ2దుగా చాంద్రాయణ గుట్ట క్రాస్ రోడ్డు వరకు రూట్ పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు ఇవ్వనున్నారు.
కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్.
- కారిడార్ 2 : MGBS మెట్రో స్టేషన్ నుండి ఫలక్‌నుమా వరకు (5.5 కి.మీ)
- కారిడార్ 2: ఫలక్‌నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ (1.5 కి.మీ)
- కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ వరకు , చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, పి 7 రోడ్‌ను శంషాబాద్ విమానాశ్రయానికి కలుపుతుంది (మొత్తం 29 కి.మీ)
- కారిడార్ 4: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ మీదుగా రాజేంద్ర నగర్ వద్ద ప్రతిపాదిత హైకోర్టు. (4 కి.మీ)
- కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్ , అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) (8 కి.మీ)
- కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్‌చెరు వరకు BHEL (14 కి.మీ)
- కారిడార్ 7 : LB నగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం మరియు హయత్ నగర్ (8 కి.మీ)