
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల ఫ్లీట్ నిర్వహణ, ట్రాన్స్పోర్ట్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ రూట్‌మాటిక్ బుధవారం హైదరాబాద్ కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇది టెక్నాలజీ ఆధారిత కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్అందిస్తుంది.
బెంగళూరు, పూణే తర్వాత భారతదేశంలో కంపెనీకి ఇది మూడవ కమాండ్ సెంటర్. కొత్త కేంద్రం ఫ్లీట్ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కార్పొరేట్ క్లయింట్‌లకు 24 గంటలూ సేవలు అందిస్తుంది.