
ఎంత దారుణం.. ఎంత దౌర్జన్యం.. నడి రోడ్డు.. మిట్ట మధ్యాహ్నం.. చుట్టూ వందల మంది ఉన్నా కూడా.. ఆ ఆటో డ్రైవర్ల దౌర్జన్యం ఇప్పుడు సంచలనంగా మారింది. కారులో ఓ వ్యక్తి ఉండగా.. అద్దాలు పగలగొట్టి అతన్ని చంపేంత పని చేయటం.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బెంగళూరు సిటీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సైతం చాలా సీరియస్ గా ఉన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని ఏజిపుర సిగ్నల్ వద్ద ఆటో డ్రైవర్ ఒక కారును ఆపి, దౌర్జన్యంగా అద్దాలు పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Bangalore: My car was vandalised by autorickshaw drivers...
— Team-BHP (@TeamBHPforum) March 22, 2024
.
More details of this incident⬇️https://t.co/T7bgdFhFYq pic.twitter.com/EPQ6tRJRPG
బాధితుడు ఇచ్చిన సమాచారం ప్రకారం అతడు ఏజిపుర సిగ్నల్ నుండి తన గమ్యస్థానానికి త్వరగా చేరుకునే ఉద్దేశంతో కారును వేగంగా తోలుతుండగా సదరు రౌడీ ఆటో డ్రైవర్ కారు వెళ్ళటానికి దారి ఇవ్వకపోవటమే కాకుండా కారును ఆపి దౌర్జన్యంగా అద్దాలు పగలగొట్టి చంపేంత పని చేశాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీస్తున్న సెల్ ని లాక్కునే ప్రయత్నాన్ని వీడియోలో మనం గమనించచ్చు. బెంగళూరు లాంటి మహానగరంలో పట్టపగలే జరిగిన ఈ ఘటన నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. వ్యక్తిగత భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.