ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదాడ క్రాస్ రోడ్డులోని ఓ దాబాలో అర్థరాత్రి(ఫిబ్రవరి 03) బిల్లు విషయమై రేవతి సెంటర్ గ్యాంగ్ కు, దాబా నిర్వహకులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఒకరిని ఒకరు కర్రలతో కట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. గొడవను అడ్డుకోబోయారు.. గొడవను అడ్డుకోబోయిన రూరల్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్, డ్రైవర్ రాజేష్ పై గ్యాంగ్ కర్రలతో దాడికి దిగారు. గాయాలయిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మరికొంతమంది పోలీసులు.. రేవతి సెంటర్ గ్యాంగ్ లోని కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.