- జగిత్యాల జిల్లా రాయపట్నంలో ఘటన
ధర్మపురి, వెలుగు : బెల్ట్‌షాప్‌లో జరిగిన గొడవ కారణంగా ఓ రౌడీషీటర్.. కానిస్టేబుల్, అతడి తండ్రిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాయపట్నానికి చెందిన రౌడీషీటర్ శ్రీనివాస్, బెటాలియన్ కానిస్టేబుల్ రాకేశ్ తండ్రి సత్తయ్య కలిసి ఆదివారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ బెల్ట్‌షాప్‌లో మద్యం తాగారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సత్తయ్య ఇంటికి వెళ్లి తన కొడుకు రాకేశ్‌కు విషయం చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీనివాస్‌పై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ తన ఇంట్లోకి వెళ్లి కోడి కత్తిని తీసుకొచ్చి రాకేశ్, సత్తయ్యపై దాడి చేశాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు జగిత్యాల జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.