తన్నబోయి తన్నించుకున్నాడు..చిరువ్యాపారులను కొట్టిన రౌడీషీటర్..ఒళ్లు పచ్చడి చేసిన స్థానికులు

తన్నబోయి తన్నించుకున్నాడు..చిరువ్యాపారులను కొట్టిన రౌడీషీటర్..ఒళ్లు పచ్చడి చేసిన స్థానికులు

వీధివ్యాపారులపై రౌడీషీటర్ల బెరింపులు చాలా కామన్ అయిపోయాయి..పొట్టకూటికోసం చిన్న వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్ల వ్యాపారులను పోకిరీలు,రౌడీ షీటర్లు వేధింపులు వార్తల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం..బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి వారి ఆగడాలు మనం వింటుంటాం..అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వీధి వ్యాపారిపై దాడి చేసిన ఓ రౌడీషీటర్ పై స్థానికులు తిరగబడ్డారు. బతుకుదెరువు కోసం ఏదో  చిన్న వ్యాపారం చేసుకుంటుంటే బెదిరించి లొంగకపోతే కొడతావా అంటూ ఒళ్లు పచ్చడి చేశారు.

హైదరాబాద్ లో తోపుడు బండ్ల వ్యాపారులను బెదరిస్తున్న రౌడీషీటర్ కు దేహశుద్ది చేశారు స్థానికులు. శనివారం (ఏప్రిల్ 5) సిటీలోని కార్వాన్ లో తోపుడు బండిపై టిఫిన్ అమ్ముతున్న వ్యక్తిపై ఓ రౌడీ షీటర్ దాడి చేశాడు. దారుణంగా కొట్టాడు. వ్యాపారిపై  పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అడ్డొచ్చిన పదిమందిని విచక్షణారహితంగా చితకబాదాడు. అంతేకాదు తోపుడు బండి, సామాన్లను ధ్వంసం చేశాడు. 

ఇక స్థానికులు ఇదంతా చూస్తూ ఉండలేకపోయారు.అందరూ కలిసి ఒక్కసారిగా రౌడీషటర్ మీద పడ్డారు. చేతికి అందిన చోట ఒళ్లు హూనం చేశారు. ఇక అతడిని సహకరించి స్నేహితుడు స్థానికులను దెబ్బలు తప్పించుకొని అక్కడినుంచి పారిపోయారు.  స్థానికుల దాడిలో రౌడీషీటర్ భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రౌడీషీటర్ ను ఆస్పత్రికి తరలించారు.  

రాజేంద్రనగర్ పరిధిలోని రౌడీషీటర్ భరత్ పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.గతంలో పట్టపగలే ఓ మెడికల్ షాపుపై దాడి చేసి షాపు మొత్తం ధ్వంసం చేసి పరారీ అయినట్లు కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.