ఓ వ్యక్తిని హత్యచేసిన హంతకులు.. అతని తల్లికి ఫోన్ చేసి చెప్పి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. బుధవారం అర్ధరాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో వినయ్ అనే రౌడీషీటర్ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్ పై గతంలోనే ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ నమోదైంది. గౌలిగూడకు చెందిన వినయ్ ఏదో పని నిమిత్తం పీ అండ్ టీ కాలనీకి వెళ్లాడు. కాగా.. సంతోష్ నగర్ కి చెందిన అన్నదమ్ముళ్లు సంతోష్ కుమార్, సందీప్ కుమార్ లకు వినయ్ తో పాత గొడవలున్నాయి. దాంతో వినయ్ ని సంతోష్, సందీప్ ఇద్దరూ కలిసి గొంతుకోసి హత్య చేశారు. అనంతరం హత్య విషయాన్ని వినయ్ తల్లికి ఫోన్ చేసి చెప్పి.. అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.
For More News..