తుమ్మల చెరువులో రోయింగ్​ వాటర్​స్పోర్ట్స్ ​ట్రైనింగ్

తుమ్మల చెరువులో రోయింగ్​ వాటర్​స్పోర్ట్స్ ​ట్రైనింగ్
  • హుస్సేన్​సాగర్ ​తర్వాత మరో సెంటర్​ అశ్వాపురంలోని ఈ చెరువులోనే..
  • ఇప్పటికే ఇక్కడ పలుమార్లు బోట్​ షికార్ చేసి పరిశీలించిన కలెక్టర్, ఐటీడీఏ పీవో 
  • దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవు.. 800 మీటర్లకు పైగా వెడల్పు ఉన్న చెరువు 
  • ఆసక్తి గల క్రీడాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. 
  • ఈనెల 28లోపు డీవైఎస్ఓ ఆఫీస్​లో ఇవ్వాలని ఆఫీసర్ల వెల్లడి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  హైదరాబాద్​లోని హుస్సేన్​ సాగర్​లో రోయింగ్​వాటర్​ స్పోర్ట్స్​ ట్రైనింగ్​తో పాటు క్రీడా పోటీలు జరుగుతుంటాయి. డైరెక్ట్​గా జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉన్న క్రీడ ఇది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్​ ట్రైనింగ్​ సెంటర్​ను హుస్సేన్​సాగర్​తర్వాత భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చెరువులో రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్ సాధ్యాసాధ్యాలను క్రీడాకారులు, ఆఫీసర్లు పరిశీలించారు. రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్​కు తుమ్మల చెరువు ఎంతో అనుకూలంగా ఉన్నట్టుగా క్రీడాకారులు గుర్తించారు. దీంతో యువజన క్రీడాశాఖాధికారులు ట్రైనింగ్​ సెంటర్​ కోసం ప్లాన్​ చేశారు.

 తుమ్మల చెరువులో పలుమార్లు కలెక్టర్, ఐటీడీఏ పీఓ బోట్​ షికార్ కూడా చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ట్రైనింగ్​ సెంటర్​ను ఏర్పాటు చేసేందుకు  పర్మిషన్​ పొందారు. ఇంటర్నేషనల్​ రోయింగ్​ క్రీడాకారుడు యలమంచిలి కిరణ్​తో ఆఫీసర్లు చర్చించారు. మొదటి దశలో భాగంగా ప్రత్యేక బోట్​ ద్వారా రోయింగ్​ స్పోర్ట్స్​తో తుమ్మల చెరువులో ప్రయోగాలు చేశారు. ఈ చెరువు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల పొడువు ఉంది. వాటర్​ నిలకడగా ఉంటుంది. 800 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. ఈ క్రమంలో చెరువులో రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్​ ట్రైనింగ్​ నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. 

ఏజెన్సీ క్రీడాకారులకు ఎంతో మేలు.. 

తుమ్మల చెరువులో రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్​ట్రైనింగ్​ సెంటర్​ ఏర్పాటైతే ఏజెన్సీ స్టూడెంట్స్​కు, క్రీడాకారులకు ఎంతో మేలు కలుగనుంది. ఏజెన్సీలో వాలీబాల్​ క్రీడకు ఎక్కువగా మక్కువ చూపుతారు. వాలీబాల్​క్రీడలో ప్రతిభ చూపిన వారికిఈ వాటర్​ స్పోర్ట్స్​లో పాల్గొనేందుకు ఈజీగా ఉంటుందని క్రీడాకారులు పేర్కొంటున్నారు. రోయింగ్​ స్పోర్ట్స్​లో సబ్​జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్​ విభాగాల్లో పోటీలుంటాయి. ఈ క్రీడలో ట్రైనింగ్​ పొందిన వారిని హుస్సేన్​ సాగర్​లో పోటీలు నిర్వహించి తెలంగాణ తరుఫున పాల్గొనే జట్లను సెలక్ట్​చేస్తారు. వాటర్​ స్పోర్ట్స్​పై గురుకులాలు, ఆశ్రమ స్కూల్స్​లలోని స్టూడెంట్స్​తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని క్రీడాకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 

ప్రతిభ చూపే వారికి మంచి అవకాశాలు

వాటర్​ రోయింగ్​ స్పోర్ట్స్​లో ప్రతిభ చూపిన వారికి ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్​ ఉంటుంది. ఈ స్పోర్ట్స్​లో కొంచెం కష్టపడితే మంచి భవిష్యత్​ ఉంటుంది. 

యలమంచిలి కిరణ్, వాటర్​ స్పోర్ట్స్, అంతర్జాతీయ క్రీడాకారుడు

28లోపు దరఖాస్తు చేసుకోవాలి.. 

అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువులో రోయింగ్​ వాటర్​ స్పోర్ట్స్​ ఈవెంట్స్​పై ట్రైనింగ్​ ఇవ్వనున్నాం. అంతర్జాతీయ రోయింగ్​ క్రీడాకారులు యలమంచిలి కిరణ్​ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్​ కొనసాగనున్నది. క్రీడాకారులకు ఆసక్తి కలిగించేందుకు మొదటి దశలో వారం రోజుల పాటు ట్రైనింగ్​ ఇవ్వనున్నాం. క్రీడాకారులు తమ దరఖాస్తులను ఈనెల 28 లోపు కలెక్టరేట్​లోని డీవైఎస్​ఓ ఆఫీస్​లో ఇవ్వాలి. ఇతర వివరాలకు 9494597083 నెంబర్​ను సంప్రదించవచ్చు. 

పరంధామ రెడ్డి, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి, భద్రాద్రికొత్తగూడెం