హైదరాబాద్‌లో ఆగిన యుద్ధ విమానాలు

యునైటెడ్ కింగ్‌డమ్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. ల్యాండ్ అయిన వాటిలో 4 టైఫూన్ ఫైటర్ జెట్లు ఉండగా.. మరొకటి వాయేజర్ ట్యాంకర్‌తో కూడిన విమానం. ఇంధనం నింపుకోవడానికి ఇవి ల్యాండ్ అయినట్లుగా ఎయిర్ పోర్టు అధికారులు ధృవీకరించారు.

 రాయల్ ఎయిర్ ఫోర్స్‌ యుద్ధ విమానాలు హైదరాబాద్‌లో దిగడంపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది ఇరు దేశాల రక్షణ బంధానికి నిదర్శమని తెలిపారు. "హలో రాయల్ ఎయిర్ ఫోర్స్!  4 టైఫూన్ ఫైటర్ జెట్లు, ఒక వాయేజర్‌తో కూడిన విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధనం నింపుకోవడానికి ఆగాయి. ఇది యూకే, ఇండియా వైమానిక దళాల రక్షణ బంధానికి నిదర్శనం.. "  అని పోస్ట్ చేశారు.