ఐపీఎల్ లో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జట్టులో ఉండటమే దీనికి ప్రధాన కారణం. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కప్ కొట్టడంలో విఫలమవుతుంది. ప్రతి సీజన్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగడం.. నాకౌట్ సమరంలో చేతులెత్తేయడం బెంగళూర్ జట్టుకు అలవాటుగా మారిపోయింది. అయితే ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2024 కోసం బెంగళూరు టీం స్టార్ ఆటగాళ్లను రిలీజ్ చేసింది.
వరల్డ్ క్లాస్ స్పిన్నర్ వనిందు హసరంగాతో పాటు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజల్ వుడ్ ను రిలీజ్ చేసింది. ఇక ఆ జట్టుకు తురుపు ముక్కగా మారిన హర్షల్ పటేల్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. వీరు ముగ్గురు భారీ మొత్తానికి కొన్నవారే కావడం గమనార్హం. హర్షల్ పటేల్ 10.75, హసరంగా 10.75, హేజాల్ వుడ్ 7.75 వదిలించుకోవడం ద్వారా 29.25 కోట్లు మిగిలించుకుంది. ఈ డబ్బుతో వేలంలో స్టార్ ప్లేయర్లను ఎవరినైనా కొంటారా అంటే అది జరగలేదు.
దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా ముగిసిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ కోసం ఏకంగా 11 కోట్లు వెచ్చించింది. ఈ విండీస్ పేసర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య వార్ నడించింది. చెన్నై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు జట్లు పోటాపోటీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది. జోసెఫ్ పర్వాలేదనిపించినా నిలకడగా బౌలింగ్ వేస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి.
న్యూజిలాండ్ ప్రధాన పేసర్ లాకీ ఫెర్గూసన్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఫెర్గుసన్ ఒకే అయినా.. యువ బౌలర్ యశ్ దయాల్ ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 5 కోట్లకు కొనుగోలు చేయడం షాక్ కు గురి చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ లో యాష్ దయాళ్ బౌలింగ్ లో రింకూ సింగ్ 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
భారత పిచ్ ల మీద సరైన అవగాహన లేని టామ్ కర్రాన్ ను రూ.1.5 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఇక దేశవాళీ క్రికెట్ నుంచి స్వప్నిల్ సింగ్ (రూ. 20) లక్ష), సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు) బేస్ ప్రైజ్ కు కొన్నారు. మొత్తానికి స్టార్ ప్లేయర్లను వదిలేసుకున్న ఆర్సీబీ తగిన మూల్యం చెల్లించుకుందని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
IPL 2024 వేలంలో కొనుగోలు చేసిన RCB ఆటగాళ్లు:
అల్జారీ జోసెఫ్ (రూ. 11.50 కోట్లు), యష్ దయాల్ (రూ. 5 కోట్లు), టామ్ కర్రాన్ (రూ. 1.5 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ. 20) లక్ష), సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు)
IPL 2024: RCB full list of players after Auction #ipl2024 #RoyalChallengersBangalore #RCB #RBC #IPL2024auction #squad #Cricket pic.twitter.com/ayxXCXjFwr
— Manohar Cricketer (@Manohar48_) December 20, 2023