పేరుకే ముంబై, చెన్నై.. బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్‌గా ఆర్‌సీబీ

పేరుకే ముంబై, చెన్నై.. బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్‌గా ఆర్‌సీబీ

ఐపీఎల్‌ టోర్నీలో అత్యంత ఆద‌ర‌ణ క‌లిగిన జ‌ట్ల‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక‌టి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ 2008 నుంచి ఆడుతున్నా.. ఈ జట్టు ఒక్కసారి టైటిల్ గెలిచింది లేదు. ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ బరిలోకి దిగడం.. చివ‌ర‌కు ఉసూరు మ‌నిపించ‌డం వీరికి పరిపాటి. అలా అని అభిమానులను నిరుత్సాహ పరచరు. గొప్ప ప్రదర్శనే ఇస్తారు.. కానీ, వారిని అదృష్టం వరించదు.

స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్‌గా RCB

ఆర్‌సీబీ ఆటగాళ్లు రాణించినా.. రాణించకపోయినా అభిమానుల ఆదరణ మాత్రం ఇసుమంతైనా తగ్గదు. ఆ జట్టు యాజమాన్యం కూడా అంతే. టైటిల్ గెలవలేదని నిరుత్సాహ పడింది లేదు. ఆటగాళ్లను నిందించింది లేదు. కోట్లు వెచ్చించి కొత్త క్రికెటర్లను కొంటూనే.. వారినే వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అదే వారికి అవార్డును అందించి పెట్టింది. సిఐఐ బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ సొంతం చేసుకుంది.

పేరుకే ముంబై, చెన్నై

ఐపీఎల్‌ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లు అంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఇరు జట్లు ఐదు సార్లు విజేతగా అవతరించాయి. కానీ, బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చేజిక్కించుకోవడంలో మాత్రం వెనుకబడ్డాయి. ఈ ప్రాంఛైజీలు పోటీలో ఉన్నా.. ఆర్‌సీబీకే అందరూ ఓటేశారు.    

కామెరాన్ గ్రీన్‌

2024 ఐపీఎల్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఆర్‌సీబీ యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ నుండి రూ.17.5 కోట్లకు కామెరాన్ గ్రీన్‌ను ట్రేడ్ చేసుకున్న ఆర్‌సీబీ.. వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

Also Read :- బౌలింగ్ స్పీడ్ పెంచు: బుమ్రాకు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సలహా