
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరోసారి విఫలమైంది. గురువారం (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన ఆ జట్టు.. చివర్లో టిమ్ డేవిడ్ (37) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సాల్ట్ (17 బంతుల్లో 37:4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ సాల్ట్ ఆరంభంలో చెలరేగడంతో తొలి మూడు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి సాల్ట్.. 17 బంతుల్లో 37 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. సాల్ట్ విధ్వంసంతో బెంగళూరు పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. పడికల్ 1 పరుగే చేసి విఫలమయ్యాడు. ఇక పవర్ ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీ (24) కూడా ఔటయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది.
బెంగళూరు ఇన్నింగ్స్ ఆసాంతాం ఒక్క క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. లివింగ్ స్టోన్ (4), జితేష్ శర్మ (3) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరగా.. 25 పరుగులు చేసిన పటిదార్ స్కోర్ పెంచాలనే ఒత్తిడిలో వికెట్ సమర్పించుకున్నాడు. కృనాల్ పాండ్య 18 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. చివర్లో టిమ్ డేవిడ్ బౌండరీల వరద పారించి ఆర్సీబీ పరువు కాపాడాడు. 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 160 పరుగుల మార్క్ చేర్చాడు.
With that start, did you expect RCB to finish with a 160+ total? 🎯https://t.co/nJ8Fe2KoCI #RCBvDC #IPL2025 pic.twitter.com/OGQUY9U6Pv
— ESPNcricinfo (@ESPNcricinfo) April 10, 2025