PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ప్లేయింగ్ 11 నుంచి లివింగ్ స్టోన్ ఔట్

PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ప్లేయింగ్ 11 నుంచి లివింగ్ స్టోన్ ఔట్

ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 20) రెండు మ్యాచ్ ల్లో భాగంగా మధ్యాహ్నం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. చండీఘర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ లివింగ్ స్టోన్ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ షెపర్డ్ ను తుది జట్టులోకి తీసుకొచ్చింది. మరోవైపు పంజాబ్ ప్లేయింగ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇరు జట్లకు ఇది ఎనిమిదో మ్యాచ్. బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు పంజాబ్ 7 మ్యాచ్ ల్లో 5 గెలిచింది. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

►ALSO READ | IPL: 14 ఏళ్ల కుర్రోడి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్ సూర్యవంశీని పొగడ్తల్లో ముంచెత్తిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్