RR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. రాజస్థాన్ జట్టులో హసరంగా!

RR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. రాజస్థాన్ జట్టులో హసరంగా!

ఐపీఎల్ లో ఆదివారం (ఏప్రిల్ 13) రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించనుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం జరగబోయే తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ ఆడిన 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించింది. మరోవైపు ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫజల్ ఫరూక్ స్థానంలో హసరంగా తుది జట్టులోకి వచ్చాడు. 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): 

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్

►ALSO READ | KL రాహుల్ రికార్డ్ బద్దలు: IPL చరిత్రలోనే తొలి ఇండియన్ బ్యాటర్‎గా అభిషేక్ నయా రికార్డ్