చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. తనకు అచొచ్చిన మైదానంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులంతా విఫలమైనా.. ఒక్కడే పోరాడి బెంగళూరు జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీకి జత కలిసిన గ్రీన్ బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్ కు 65 పరుగులు జోడించిన తర్వాత 33 పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్ వెల్ (28) ఉన్నంత సేపు ధాటిగా ఆడి ఔటయ్యాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం పరుగులు చేస్తూనే ఉన్నాడు. చివర్లో దినేష్ కార్తీక్ 3 సిక్సులతో 8 బంతుల్లోనే 20 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 182 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ కు ఒక వికెట్ దక్కింది.
Royal Challengers Bengaluru 182/6 in 20 overs (V Kohli 83*) vs Kolkata Knight Riders in an IPL 2024 game#IPL2024 #RCBvsKKR #RCBvKKR
— CricketNDTV (@CricketNDTV) March 29, 2024
Live Scorecard https://t.co/XRu1smGEcn
Live Updates https://t.co/RJLLie19pr pic.twitter.com/fYalot5e50