వాంఖడే వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించింది. డుప్లెసిస్, రజత్ పటిదార్ హాఫ్ సెంచరీలు తోడు చివర్లో దినేష్ కార్తీక్ విధ్వంసం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టినా మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ముంబై ముంది భారీ టార్గెట్ సెట్ చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే ఓపెనర్ కోహ్లీ (3) వికెట్ ను కోల్పోయింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడుతున్న జాక్స్ 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 82 పరుగులు జోడించిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన పటిదార్(26 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సులు) ఔటయ్యాడు. ఫామ్ లో ని మ్యాక్స్ వెల్ మరో సారి డకౌట్ గా వెనుదిరిగాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 40 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లతో 61 పరుగులు చేసి చివర్లో ఔటయ్యాడు. ఏ దశలో జట్టు బాధ్యతలను కార్తీక్ తీసుకున్నాడు.
చివర్లో విధ్వంసం సృష్టించి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఆర్సీబీ స్కోర్ 190 పరుగుల మార్క్ దాటింది. ఆకాష్ మద్వాల్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు.